విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకుడికి డాక్టరేట్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కే.ప్రవీణ్ కుమార్ అనే అధ్యాపకుడికి సీఎస్‌ఈ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్– బేస్డ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ఎమోషన్ రికగ్నిషన్ ఇన్ ఇంగ్లిష్ పొయిట్రీ’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్వీ ఫణీకుమార్ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా 1 ఎస్‌సీఐ, 3 స్కోపస్ పేపర్లు పబ్లిష్ చేశారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టా పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కే.ప్రవీణ్ కుమార్‌ను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.