ప్రభుత్వ ఉత్తర్వులతో ఉపశమనం
_మూడు జిల్లాల్లో ప్రమోట్ కానున్న 17.10 లక్షల విద్యార్థులు
★ ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు ఉంటాయా..? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తెలంగాణ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
★ అన్ని యాజమాన్యాల పరిధిలో నడుస్తున్న పాఠశాలల్లో ఎలాంటి పరీక్షలు లేకుండా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులందర్నీ తర్వాతి తరగతులకు ప్రమోట్ చేస్తూ ఆదేశాలిచ్చింది.
★ ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 17.10 లక్షల మంది విద్యార్థులు తర్వాతి తరగతులకు ప్రమోట్ కానున్నారు.
★ విద్యార్థులకు సమ్మిటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)-2 పరీక్షలు లేకుండా ఎగువ తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగా.. విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
★ ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 6,400 పాఠశాలలు ఉన్నాయి.
★ వీటిల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు 17.10 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
★ వీరందరూ పాఠశాలలు తెరిచిన తర్వాత ఎగువ తరగతుల్లోకి వెళ్లనున్నారు.
★ ఇప్పటికే ప్రైవేటు యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.