Skip to main content

ఆంధ్రప్రదేశ్ లో 18 నుంచి రోడ్లపైకి బస్సులు?

ఆంధ్రప్రదేశ్ లో 18 నుంచి రోడ్లపైకి బస్సులు?


*లగ్జరీలో 26, పల్లె వెలుగులో 34 మందికే చోటు*


*ఆ మేరకు సీట్లు సర్దుబాటు చేస్తున్న పీటీడీ*


*ప్రతి డిపో నుంచి 4-12 వరకు బస్సులు సిద్ధం*


*నష్టాల భర్తీకి 40-50% చార్జీల పెంపు?*


*ప్రయాణికుడి చేతిలో రెండు చుక్కలు శానిటైజర్‌*


*ఆ బాధ్యతా డ్రైవర్‌కే.. కండక్టర్‌ ఉండరు..*


*ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన పీటీడీ..*


*సర్కారు అంగీకరిస్తే ప్రయాణికులపై భారమే*


అమరావతి
 యాభై రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కెందుకు సిద్ధమవుతున్నాయి. కొవిడ్‌-19 ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ నుంచి ఒక్కొక్కటిగా సడలింపులు వస్తుండటంతో పీటీడీ(ప్రజా రవాణా విభాగం) అధికారులు బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 17 తర్వాత మరోమారు కేంద్రం లాక్‌డౌన్‌ను కొనసాగించినా, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల వరకూ సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో సీట్లను పీటీడీ సర్దుబాటు చేస్తోంది. సీట్ల కెపాసిటీని సగానికి తగ్గించుకోక తప్పడంలేదు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి 40-50 శాతం టికెట్ల ధర పెంచేందుకు పీటీడీ  ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ప్రయాణికులపై భారం తప్పదు.  


*సీట్ల సర్దుబాటు ఇలా...*


▪️పీటీడీలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులున్నాయి. దూర ప్రాంతాలకు సూపర్‌ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్‌ సర్వీసులున్నాయి. రాష్ట్రం బయటికి వెళ్లే వాటిలో ఎక్కువగా ఏసీ బస్సులు ఉన్నాయి. పల్లెవెలుగు బస్సులో 60 సీట్ల కెపాసిటీ ఉండగా, ఇకపై 34మందికి మించకుండా తీసుకెళ్తారు. ముగ్గురు కూర్చునే సీట్లలో మధ్యలో వదిలేసి ఇద్దరికే  అవకాశమిస్తారు. ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరినే కూర్చోబెడతారు. ఫలితంగా 26 సీట్లు ఖాళీగా వదిలాల్సి ఉంటుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే 40శాతం చార్జీ పెంచాల్సిందే అంటున్నారు అధికారులు. ఇక సూపర్‌లగ్జరీ బస్సులో రెండు వరుసలుగా 36 సీట్లు ఉంటాయి


అటు తొమ్మిది, ఇటు తొమ్మిది తొలగించి మధ్యలో ప్రయాణీకులు నడిచే ప్రాంతంలో 8 సీట్లు కొత్తగా అమర్చారు. దీంతో ఇకపై ఈ బస్సుల్లో 26మందికి మించి ప్రయాణించడం సాధ్యం కాదు. కనీసం 30శాతానికిపైగా నష్టాల్ని భరించక తప్పదు. అలా్ట్ర డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం 40 సీట్లున్నాయి. కుడివైపు పది, ఎడమ పది సీట్లు తొలగించి మధ్యలో 8 అమర్చుతున్నారు. అంటే 12 సీట్లు తగ్గుతాయి. ఈ నెల 18 నాటికి ప్రతి బస్‌ డిపోలోనూ 4 నుంచి 12 బస్సుల వరకు ఆ మేరకు సీట్లు సర్దుబాటు చేయనున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 128 బస్‌ డిపోల నుంచి మొత్తం సుమారు 800 బస్సులకు సీట్ల సర్దుబాటు వచ్చే ఆదివారం నాటికి పూర్తవుతుందని పీటీడీ అధికారులు చెబుతున్నారు. 


*ఏసీ బస్సుల్లో సగం సీట్లే..*


▪️కాగా, దూర ప్రాంతాలతోపాటు రాష్ట్రం దాటి వెళ్లే ఏసీ బస్సుల్లో సీట్ల మార్పులు చేయడం లేదని పీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇంద్ర సర్వీసుల్లో రెండు సీట్లు చొప్పున రెండు వరుసల్లో 40 సీట్లు ఉండగా ఒక్కో ప్రయాణికుడికే అనుమతించాలని భావిస్తున్నారు. అమరావతి బస్సుల్లో 48 సీట్లు ఉంటే అందులో సగం సీట్లే భర్తీ చేస్తారు.  


*బస్సెక్కగానే చేతిలో రెండు చుక్కలు..*


▪️ఈ బస్సుల్లో కండక్టర్‌ ఉండరని పీటీడీ అధికారులు చెబుతున్నారు. సీట్లకు మించి ఒక్క ప్రయాణికుడిని కూడా ఎక్కించబోమని, ప్రతిదీ గ్రౌండ్‌ బుకింగ్‌ చేసిన తర్వాత డ్రైవర్‌ను మాత్రమే పంపుతామని చెబుతున్నారు. ప్రతి ప్రయాణికుడికి చేతిలో శానిటైజర్‌ వేయాలన్న ఆలోచన ఉందని, ఆ బాధ్యత డ్రైవర్‌కు అప్పగిస్తామంటున్నారు


Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...