రాపర్ల లో విషాదం 9 మంది మృతి.
నావులుప్పలపాడు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (మం) రాపార్ల గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.
మిరపకాయలు కోత పనికి ముగించుకుని వచ్చి తిరిగి ట్రాక్టర్ లో ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.ట్రాక్టర్ పై వస్తున్న వ్యవసాయ కార్మికులు ప్రమాద వశాత్తు మార్గమధ్యంలో ఉన్న విద్యుత్ హైటెన్సన్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం పాలయ్యారు.
మృతులు అందరూ రాపర్ల గ్రామానికి చెందిన వారు .ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది.
ఘటనాస్థలనికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించే పనిలో పడ్డారు. నాగులుప్పలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.