అభ్యుదయ దర్శకులు టి. కృష్ణ నేడు దర్శకులు తొట్టెంపూడి కృష్ణ వర్థంతి. ఈ సందర్బంగా ఆయన సినీజీవితం గురించి నెమరు వేసుకుందాం. టి. కృష్ణ సినిమా రంగంలో ఎన్నో విభాగాల్లో పనిచేసారు. ముఖ్యంగా ఎడిటర్ గా, నటుడిగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఆయన తెలుగు సినిమాల్లో ఒక విప్లవం తీసుకోచ్చారు.పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం, టి. కృష్ణ కు మంచి పేరు తెచ్చాయి. తెలుగు సినిమా రంగంతో పాటు, ఆయన మళయాళం, మరియు కన్నడ ప్రేక్షకులను అలరించారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన సినిమా "రేపటి పౌరులు". ఆయన ఎంతోమంది దర్శకులను విప్లవ సినిమాలు దర్శకత్వం వహించేలా ప్రేరణ చేశారు. ఈ కోవలో ఆర్. నారాయణ మూర్తి గారు ముందు అనిచెప్పవచ్చు. కృష్ణ నాటక రంగాన్ని కూడా చాలా ప్రభావం చేశారు అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నాటక రంగ అభివృద్ధికి కృషి చేశారు.
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.