జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్–2024లో విజ్ఞాన్స్ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్ సామ్యూల్ చార్లీ (రోబోటిక్స్ అండ్ ఆటోమెషిన్ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్ – మొదటి సంవత్సరం) విద్యార్థులు నవంబర్ నెల చివరి వారంలో...