గర్భిణీ స్త్రీలకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి
స్థానిక తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం తెనాలి పరిధిలోని సచివాలయ ఆరోగ్య కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశం లో మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ బీజాపూర్ వెంకటరమణ పలు సూచనలు చేశారు. నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు కాన్పు సమయంలో తప్పనిసరిగా పరీక్షలు చేయించాలని తెలియజేశారు. మున్సిపల్ పరిధిలోని కొత్త వారు ఎవరైనా వచ్చినచో వెంటనే ఆరోగ్య సిబ్బంది పరిశీలించి ఎక్కడి నుంచి వచ్చినది సంబంధిత వివరములను కార్యాలయానికి తెలియజేయాలన్నారు. గృహం లోపల ఉండేటట్లు పోలీసు వారి సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు.గర్భిణీ స్త్రీలను నిర్దేశించిన కాల ప్రమాణంలో సంస్థాగత ప్రసవాలు జరిగే విధంగా ఆరోగ్య కార్యదర్శి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రేమ్ చంద్ , డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి, ఆయుష్ వైద్యులు డాక్టర్ యు. బి. భాస్కర్ రావు, డాక్టర్ ఎస్. బాలప్రభావతి, డాక్టర్ ఎం. శ్రీనివాస్ నాయక్, డాక్టర్ బి. శ్రీనివాసరావు, ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి, సబ్ యూనిట్ అధికారి వంగల పున్నా రెడ్డి, హెల్త్ విజిటర్ పీ వెంకటేశ్వరమ్మ హెల్త్ అసిస్టెంట్ నీ లా ప్రసన్న బాబు డి ఈ ఓ లీలా ప్రసాద్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...