సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై జ్ఞానశేఖర్ గల్లా నిర్మాతగా తెనాలి పట్టణానికి చెందిన కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో ప్రణామం అనే చిత్రం షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ఏప్రియల్ మొదటి వారం నుంచి తెనాలి పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని నిర్మాత జ్ఞాన శేఖర్ గల్లా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని అతిధి గ్రాండ్లో చిత్ర యూనిట్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ చిత్ర కథానాయకి అర్పిత ఆవిష్కరించారు. అర్పిత మాట్లాడుతూ ప్రణామం చిత్రం లో నటించడం సంతోషకరం అన్నారు. అవకాశం కల్పించిన దర్శకుడు రత్నాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.దర్శకులు రత్నాకర్ చిత్ర యూనిట్ సబ్యలను పరిచయం చేసారు.అర్పిత తో పాటు సురభి ప్రభావతి, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, మధుకర్, సోమేశ్, వసంత యామిని, భవాని తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు. అమ్మ సుధీర్ గోగినేని, సామ్రాట్ మాస్టర్లు నృత్య దర్శకత్వం, ఆర్ట్ అపర్ణ చంటి పనిచేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.