బ్యాంకులు, చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సామాన్యుడు దాచుకొనే సొమ్ముపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై ఏడాదికి ప్రస్తుతం 4 శాతంగా ఉన్న వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పై ఇచ్చే వడ్డీపైనా కోత పెట్టింది. దీన్ని 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్ల సేవింగ్ పథకాలపై ఇచ్చే వడ్డీని 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలపై ఇచ్చే వడ్డీని 7.6 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.