తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కొత్తపేట కోర్టు ప్రాంగణంలోని తెనాలి బార్ అసోసియేషన్ హాలు నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు జారీ చేసిన ప్రాక్టీస్ సర్టిఫికెట్స్ మరియు ఐడి కార్డులను న్యాయవాదులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సోమశని బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి బ్రహ్మానంద రెడ్డి ప్రసంగిస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం బార్ కౌన్సిల్ ప్రయత్నిస్తోందని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో న్యాయస్థానాలు పని పనిచేయని కారణంగా పలువురు న్యాయవాదులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి బ్యాంకుల ద్వారా పర్సనల్ లోన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని తెలిపారు. సర్టిఫికెట్లు మరియు ఐడి కార్డులు న్యాయవాదులకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని గుర్తించటం కోసం భారత బార్ కౌన్సిల్ ఈ విధానాన్ని రూపొందించిందని ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి న్యాయవాదులు తమ లైసెన్సులను రెన్యువల్ చేయించుకుంటూ ప్రాక్టీస్ సర్టిఫికేట్ మరియు ఐడి కార్డులను పొందవలసి ఉంటుందని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ ప్రసంగిస్తూ తక్షణమే న్యాయవాదులకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బార్ కౌన్సిల్ ద్వారా అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ తో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు,చికిత్స పొంది కోలుకున్న వారికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని బార్ కౌన్సిల్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లిముంత విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు భేతాళ ప్రభాకర్, సీనియర్ న్యాయవాదులు మాదినేని వెంకటేశ్వర్లు, జగదీశ్వరాంబ, అసోసియేషన్ సహాయ కార్యదర్శి గ్రంధి జయరామ కృష్ణ మరియు సభ్యులు కోట రమేష్ నాయుడు, వేజెండ్ల జగజ్జీవన్ దంతాల కిరణ్ కుమార్, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.