టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యార్థులు సత్తా చాటారు. ఎం.పి.సి విభాగంలో యార్లగడ్డ అమృత భార్గవి 1000 మార్కులకు 991,టి. సుష్మ 985, షేక్ ఆసియా 983, ఎస్.నిత్యశ్రీ 983, టి. భాను 950 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో కె.ప్రియాంక 1000 మార్కులకు 988 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను వివేక విద్యాసంస్థ ల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.