శ్రీ హరిహరధీర మూవీ మేకర్స్ పతాకంపై అమర్‌దీప్,అశ్విని రెడ్డి హీరోహీరోయిన్లుగా శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో శ్రీమతి శిరీష నిర్మించిన చిత్రం ‘అభిలాష’. ‘లవ్ లైట్స్ ద లైఫ్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల నెల్లూరులోని అనీల్ గార్డెన్సు లో నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ‘సాహో’ మూవీ డైరెక్టర్ సుజిత్ నాన్నగారైన గోపీనాధ్ రెడ్డి, ‘మేకసూరి’ మూవీ డైరెక్టర్ వెలిశిల త్రినాధ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డిలతో పాటు చిరంజీవి యువత, పవన్ కల్యాణ్ యువత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హాజరైన ప్రముఖులందరూ చిత్రం మంచి విజయం సాధించాలని, టీమ్‌లోని అందరికీ మంచిపేరు రావాలని అభిలాషించారు.అమర్‌దీప్ చౌదరి,, అశ్వినిరెడ్డి, బెల్లంకొండ వెంకట్, బాహుబలి ప్రభాకర్, కుమనన్ సేతు రామన్, సమ్మెట గాంధీ, అప్పాజీ అంబరీష,ఐ డ్రీమ్ అంజలి, గుండు సుదర్శన్, గుండు అశోక్ కుమార్, ఆంజనేయులు, రాకింగ్ రాకేష్, జబర్దస్త్ రాజమౌళి, చిట్టిబాబు, జలీల్ భాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికిఫైట్స్: నభా స్టంట్స్, సంగీతం: ఎమ్.ఎమ్. కుమార్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: రోహిత్ బాబు, ఎడిటింగ్: రవితేజ కుర్మాన, కెమెరా: శివ కమ్మిలి, అడిషనల్ కెమెరామెన్స్: సౌమ్య శర్మ, కన్నా కోటి; ప్రొడక్షన్ మేనేజర్: రామకృష్ణరాజు, స్ర్కీన్‌ప్లే: పండు చరణ్, పీఆర్వో: బి. వీరబాబు, నిర్మాత: శ్రీమతి శిరీష, రచన మరియు దర్శకత్వం: శివప్రసాద్ చలువాది
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.