స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళాశాలలో క్రానియన్ చర్చ్ ఆధ్వర్యంలో శనివారం సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ త్రో బాల్ కెప్టెన్ సునీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వర రావు మాట్లాడుతూ యేసు క్రీస్తు కృప తో గత మూడు రోజులుగా క్రానియన్ చర్చి వారు సువార్త కూడికలు నిర్వహించడం అభినందనీయమన్నారు. . ప్రేమ, కరుణ, అందరికీ పంచాలని ఏసుక్రీస్తు చెప్పినట్టుగా వారి బోధనలు ఆచరించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించి వారికి మంచి మనసుతో నూతన వస్త్రాలు బహిష్కరించడం ఆనందించదగ్గ విషయం మన్నారు.జాతీయ త్రో బాల్ కెప్టెన్ చావలి సునీల్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని, వారిని గౌరవించడం మన బాధ్యతగా భావించాలని తెలిపారు. సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నా పున్నయ్యను ఆయన అభినందించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అతిథులు గుంటూరు కోటేశ్వరరావు, చావలి సునీల్ అందజేశారు ఈ కార్యక్రమంలోనూ పాస్టర్ లు తంగిరాల యోబు, మంచాల సురేష్, కొప్పుల కాలేబు, గొళ్ళ సతీష్ బాబు, గోళృ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...