టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
వినియోగదారుల శ్రేయస్సే తమ బ్యాంకు లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు ఏరియా మేనేజర్ కె .ఎస్. పవన్ కుమార్ చెప్పారు తెనాలి బుర్రిపాలెం రోడ్డులో టీ. జీ.కేకళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఖాతాదారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారులకు అవసరమైన రుణాలను తక్కువ వడ్డీకేఅందిస్తామని తెలిపారు. వ్యవసాయానికి, పశు సంపదకు, ల్యాండ్ డెవలప్మెంట్ కు ,చదువుకునే విద్యార్థులకు నర్సరీలు పెంచుకునేందుకు, రుణాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏ బ్యాంకు ఇవ్వని విధంగా అందరికీ రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారులు కూడా రుణ సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు. చిన్న బడ్డీ కొట్టు దగ్గర్నుంచి పెద్ద పరిశ్రమల వరకు రుణాలు ఇస్తామన్నారు. గృహాలకు 6.5 శాతం వడ్డీ అంటే కేవలం 53 పైసలు పడుతుందని చెప్పారు. వాహనాలు కూడా అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. హౌసింగ్ లోన్ లు రెండు సంవత్సరాల పాటు కడితే వారు ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి వస్తే ఇంకా తక్కువ అని చెప్పారు. అదేవిధంగా హౌస్ సైట్ వ్యాల్యూ ని బట్టి 75 శాతం వరకు రుణాలు ఇస్తామని వెల్లడించారు. పర్సనల్ లోన్స్ ఏడున్నర లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇస్తామన్నారు. అదేవిధంగా దేశ,విదేశాలలో చదువుకునే విద్యార్థులకు 80 లక్షల వరకు లోను సదుపాయం ఉందని, అయితే ఆస్తిని తనఖ పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. బంగారు నగలపై 80 శాతం వరకు రుణ సదుపాయంఉందన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు రుణాలు పంపిణీ చేశారు. ఈ ఈ కార్యక్రమంలో లో ఎస్ కే సి వి ఇన్చార్జ్ వెంకటేశ్వరరావు, ఆర్ బి సి ఆఫీసర్ వెంకటరెడ్డి, తెనాలిలోని మూడు శాఖల బ్రాంచ్ మేనేజర్ లు కె. రవి ,అబ్దుల్ గఫూర్, కె. శ్రీకాంత్ సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు.
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...