తెనాలి: పట్టణానికి చెందిన దర్శకుడు, పాత్రికేయుడు,వరల్డ్ రికార్డ్ హోల్డర్, సమాచారహక్సంఘం జిల్లా కార్యదర్శి కనపర్తి రత్నాకర్ జన్మదినోత్సవ వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ కార్యాలయం లో శుక్రవారం ఘనం గా జరిగాయి. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ తాను జాతీయఉద్యమం నేపథ్యంలో , తెనాలి పరిసర ప్రాంతానికి చెందిన చుక్కపల్లి రామయ్య చరిత్రని వీరస్థలి తెనాలి అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని రూపొందించామని చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం గా అవార్డ్ లభించిందన్నారు. ఫిబ్రవరి ఆఖరి వారంలో శ్రీ మీడియా బ్యానర్ పై మరో నూతన చిత్రంప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళ్యాణమస్థు చిత్ర దర్శకుడు ఒసాయి, రామ్ కి, శ్రీ శ్రీ మీడియా నిర్వాహకుడు మునిపల్లి. శ్రీకాంత్, ఆర్ట్ డైరెక్టర్ అపర్ణ చంటి, కొరియోగ్రాఫర్ లు సుధీర్, కిరణ్, పాత్రికేయులు పున్నయ్య, ప్రభాకర్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత రత్నాకర్ ప్రత్యేక కేక్ ను కట్ చేశారు.
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.