టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ చిత్రకారుడు చిత్ర బృందానికి వినూత్నంగా ఆల్‌ది బెస్ట్ తెలిపాడు. నిజాంపేట్‌కు చెందిన సద్గురు ది స్కూల్ అఫ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు... ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు.. ముక్కుతో డైరెక్టర్ రాజమౌళితో పాటు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాలను చిత్రించి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...