Skip to main content

తల్లి ప్రేమ అనిర్వచనీయం…

తల్లి ప్రేమ అనిర్వచనీయం…’ 

కొండూరి శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయుడు, 

నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్.

అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు  ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను ఏమీ చేసుకోలేకపోయినా, దీపం పెట్టుకోలేక పోయినా, స్తోత్రం చెప్పుకోలేక పోయినా, తనలో తానే ఏవో సంధిమాటు మాట్లాడుకుంటున్నా, తన బిడ్డకు మాత్రం ఉద్ధారకురాలే.. ఎలా అంటే అమ్మ అంటూ ఒక ఆకారం అక్కడ వుంటేనే కదా! కొడుకుకానీ, కూతురు కానీ వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకోగలిగేది. ఒక వ్యక్తి అలా తన అమ్మకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణం, పదివేసార్లు కాశీయాత్ర చేసిన పుణ్యఫం దక్కుతుందని శాస్త్రం. బిడ్డకు ఇంత పుణ్యం ఇవ్వగలిగిన అమ్మ మాత్రం తనకంటూ తాను ఏమీ చేసుకోదు. అమ్మ ఉన్నది కాబట్టి మనకి ఆ పుణ్యం వస్తున్నది. అమ్మకు నమస్కారం చేయడం అంత గొప్ప ఫలితాన్నిస్తుంది. బాహ్యంలో ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎన్నో చండీ హోమాలు చేసినా, దేవాలయాలు కట్టిచ్చినా, అన్నదానాలు చేసినా తల్లికి నమస్కారం చేస్తే వచ్చిన ఫలితంతో అవన్నీ సమానం కావు. ఆ ఫలితం అంతా ఇంతా అని చెప్పడము కుదరదు. అంటే చెప్పడం కష్టం. అమ్మ త్రిమూర్త్యాత్మక స్వరూపమై తనంతటతానుగా అంత పుణ్యాన్ని ఇవ్వగదు. అందుకే మాతృదేవోభవ. అందుకే అమ్మ దేవత. అమ్మే పరబ్రహ్మం. తల్లిని గౌరవించని వాళ్ళు లేరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళూ,  బ్రహ్మచారులు, వానప్రస్థులు అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. మరి సన్యాసి ఎవరికి నమస్కరిస్తారు? చాతుర్మాస్య దీక్షలు ఎక్కువ చేసినవారు ఎవరున్నారో వారికి మిగిలిన వారు నమస్కరిస్తారు. ఎక్కువ దీక్షలు చేసినవారు, తక్కువ చాతుర్మాస్యాలు చేసిన వారికి నమస్కరించరు. అది సంప్రదాయం. కంచి కామకోటి మఠం వంటి పీఠాలలో కూడ ఇప్పటికీ ఒక నియమం ఉంది. ఒకసారి పిల్లవాడు మఠాధిపత్యం వహించాడనుకోండి. అప్పుడు సందర్శకుల వరుసలో వస్తున్న తండ్రిగారికి కూడా ప్రత్యేకత ఏమీ ఉండదు. కడుపునబుట్టిన కొడుకయినా సరే, తండ్రికూడా వచ్చి పీఠాధిపతుల  పాదాలకు అందరిలాగే నమస్కారం చేసుకోవలసిందే. కానీ తల్లిగారు వరుసక్రమంలో వస్తున్నారనుకోండి. వెంటనే పీఠాధిపతయినా కూడా లేచి నిబడి అమ్మగారికే నమస్కారం చేయాలి. అది సంప్రదాయం, అది నియమం …అమ్మకు పాదాభివందనం…

అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే ॥

🌹భగవంతుడు మనందరి కోసం సృష్టించిన అత్యద్భుతమైన బహుమతి 🙏అమ్మ🙏…
అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...