ఇటీవల ఆకస్మిక మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కందుల శ్యామ్ కుటుంబ సభ్యులను వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ మంగళవారం పరామర్శించి వారి కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ మంచికి మారుపేరుగా నీతి నిజాయితీలతో పనిచేసిన శ్యామ్ ఆకస్మిక మరణం తీరనిలోటని అన్నారు. సంక్షేమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమనం భూషణం మాట్లాడుతూ జర్నలిస్టు శ్యామ్ మరణం తీరని లోటని తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో తనకంటూ పత్రికా రంగంలో ఒక ముద్ర వేసుకొని మంచి వార్తలు రాసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. శ్యామ కుటుంబానికి అండగా నిలిచి వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ అభినందనీయులని ప్రశంసించారు. బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ మట్లపూడి సైమన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడుతున్న హార్వెస్ట్ ఇండియా అధినేత ప్రశంసనీయులని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న చర్చిని డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి పెద్దలు ఆయనకు జ్ఞాపకం బహుకరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు, మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు శుద్ధపల్లి నాగరాజు, అత్తోట శ్యామ్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు కొండముది బోసు, కొమ్ము రాయల్, తెనాలి ఆనంద్, కూచిపూడి మోహన్, ఎల్లమాటి నాని, తెనాలి ఆనంద్ కుమార్, తెనాలి నాగరాజు ,అత్తోట బెనర్జీ, చర్చి పెద్దలు పాల్గొన్నారు.
విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...