Skip to main content

సఖా! ఇది లేఖో! ప్రేమ కవన రేఖో


శీర్షిక: 
సఖా! ఇది లేఖో! ప్రేమ కవన రేఖో!

నువ్వు నాకెప్పుడూ ఒక అద్భుతానివి.మనసు నిండా నిండిన మల్లెల సౌరభానివి!మధురోహలను నింపేస్వప్నసుందరునివి..నాకోసమే  ననిపించే హాయి నిచ్చే మాయవి ! నిన్ను తలచిన ప్రతిక్షణం నా పెదవులపై సిగ్గుల చిరునవ్వుల తళుకులు! ఉద్విగ్నత తో కూడిన గుండె లయల ఝల్లు...ఏ హిమగిరి సానువులలోనో వ్రతం ప్రక్కన బెట్టిన ప్రవరాఖ్యునిలా  .. మురిపిస్తావు. వెచ్చదనం నా ఒంటికి అద్ది,ఆనందాన్ని  మింటికి చేరుస్తావు .నువ్వు వందల మైళ్ళు  దూరంలో వున్నా...సందేశాల మొయిలు  మోయలేని హాయి  నిస్తుంది. నీ మాటను, నీ రూపాన్ని,నీ రచనా సరళి నీ  ప్రతి విషయాన్ని ఆరాధిస్తున్నా! ఆరాధి స్తూనే ఉంటా! నీ ఆలోచన మధుర స్వ ప్నాల రాశులతో  నను నిరంతరం మై మరపిస్తుంది.అన్నింటి కంటే ముందు  నిన్ను తలచుకుంటే నేను అమ్మాయి ననే విషయం నాకుగుర్తుకువస్తుంది.నిజంగా నువ్వు నాకోసం  ఉన్నావనిఅనిపిస్తుంది.,*
*నన్ను  మెప్పించాలనీ అసలు ఏనాడూ అనుకోవు.నేను నిన్ను తలచుకుంటే ఎంత  వత్తిడి లో నున్నా...... ఆనంద లహరి లో, అధ్భుత ప్రపంచంలో విహరిస్తూ.. *హాయిగా,సంతోషంగా*
*ఉత్సాహంగా, ఉత్తేజంగా* *మారగలను.అసలు నేను ఇదిచేయలేను...అనుకున్నప్పుడు నువ్వు చేయ గలవు అనే ధైర్యం ఇస్తావు చూడు! అప్పుడు నేను ఏదైనా చేయగలను*.*నిజానికి  మనం చాలా దూరంలో ఉన్నాం.కానీ  ఆ దూరం ఎప్పుడో మనకు అందనంత దూరం  వెళ్లి పోయిందని తెలుస్తూనే ఉన్నది.నేను ఎప్పుడో నీ వై పోయాను.ఇక ఇప్పుడు నీకు నువ్వే నేను మంచి వానిని కాదు !అని చెప్పినా... వెనక్కి తీసుకోలేనంత ప్రేమ!  ఎలాంటి వాడవైనా  నిన్ను అను క్షణం   ప్రేమించడానికి సిద్ధంగావున్నాను.అపుడపుడూఅసూయవస్తుంది.అది నా ప్రేమకు కొలబద్ద!.. నిన్ను కట్టి పడేయ లేను. ఇష్టం కూడా ఉండదు.నేను స్వేచ్ఛ నిచ్చినా ...నువ్వు .. నన్నే...నన్ను మాత్రమే తలుచుకునే ప్రేమ కావాలి. అదే హృదయం లో రావాలి. అన్ కండిషనల్  లవ్...ఈ ప్రేమికుల రోజున* *యెంతచెప్పుకున్నా..ఇంకా* *మిగిలే వుంటుంది. మై డార్లింగ్! లవ్ యూ!* *Love you forever!* *నువ్వు నాకు ఇప్పటికే  ఎన్నో ఎన్నెన్నో ఇచ్చావు. .ప్రతి కష్టానికిచలిస్తున్నావు. అర్థంచేసుకుంటావు. *  ఇన్ని ఊగాదులు , ఉషస్సు లూ గడిచినా తగ్గని నీ ప్రేమ   ఒక  అపురూపం!ఒక్కోసారి అపార్థంచేసుకున్నావనుకో!..అనుమానం,అసూయ అపుడపుడూ పడ్డా వ నుకుంటా!  ఇంత కంటే ఏ లవర్ గొప్ప గా ప్రేమ నివ్వగలడు !? ఇంకో విషయం .నీకు నచ్చని దే విషయం ఉన్నా చెప్పు! నీ కోసం సరిదిద్దు కుంటాను.ఇది రాస్తుంటే నాకు చాలా ఉద్విగ్నం గా ఉంది.సరిగా చెప్పలేక పొతున్నానా! ఏమో! ఏదో ఆంగ్లేయులు ప్రేమ తెలుపు కోవడానికి  వాళ్లకు ఓరోజు కావాలి!  అని మనం నిరంతరం ప్రేమిస్తూనే వుంటాము అని అనుకుంటాము కానీ...వాళ్ళ లా మనం కూడా బిజీ అవ్వలేదూ! ఇలా చెప్పుకుంటే బాగుంటుంది కదా! కాదా! ఉదయం నుండీ ఒక ప్రత్యేకమైన రీతిలో నీ హృదయానికి  నా అక్షర పారిజాత మాలలు వేయాలని ఇప్పటి వరకూ సమయం దొరకక వేచియున్నా! నాకు అఖరి క్షణం వరకూ ఎప్పటికీ నీ ప్రేమ కావాలనుకునే నీ నేను! Love you! For ever!* *రచన: డా. బి హెచ్ 
వి.రమాదేవి.*
*రాజమహేంద్రవరం.*
*14_2_23*
*చరవాణి:6305543917.*
🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️🪷❤️

Popular posts from this blog

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...