పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, దేశ రాజధాని ఢిల్లీలో మీడియాపై దాడి జరగటం హేయమైన చర్యలని ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షులు మంచికలపూడి రవికుమార్ అన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టు, మరికొంతమంది మీడియా ప్రతినిధులపై అమానుష చర్యలను ఖండిస్తూ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రువారం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి బి. వెంకటస్వామి కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్ ను అమానుషంగా అరెస్టు చేయటం బాధాకరమన్నారు. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా మీడియా స్వేచ్చ కు సంకెళ్ళు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛలో దేశంయొక్క స్తానం 161 కి పడిపోవడం దేశ పత్రికల దుస్థితిని తెలియజేస్తుందని అన్నారు. నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్ మాట్లాడుతూ ఢిల్లీ లో 30 ప్రాంతాల్లో న్యూస్ పోర్టల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం దారుణమన్నారు. జర్నలిస్టుల ఇళ్ళపై దాడులు వారికి ఎంతో కీలకంగా ఉన్న ల్యాప్ టాప్స్, మొబైల్ ఫోన్లు పోలీసులు లాక్కోవటాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేసామన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు బచ్చు సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్, మేకల సుబ్బారావు, పి.పున్నయ్య సభ్యులు బి చంద్రమోహన్, డి నాగరాజు, సిహెచ్ చంద్రశేఖర్, డి వెంకటేశ్వరరావు, కరేటి సాంబశివరావు, డి రవికిరణ్, వి లక్ష్మణరావు, ఎన్ భాస్కర్ తదితరులు పాల్గున్నారు.
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.