చుండూరుడిసెంబర్ 17 మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేంద్రనాద్ రెడ్డి చేతుల మీదుగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తోపాటుగా చుండూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగావిధులు నిర్వహిస్తున్న313 రాజ్ కుమార్ నేర చేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా బ్రోంజ్ మేడల్ ను శనివారంఅందుకున్నారు రాజ్ కుమార్ తెనాలి పరిసర ప్రాంతాల్లో నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేకంగా దృష్టిసరించి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి సఖ స క్యాంగా అనేక నేర పరిశోధనలను చేసి అనేక కేసులను సేధిస్తూ ఉన్నతాధికారులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన విదు లు నిర్వహిస్తున్నారు బ్రోంజ్ మెడల్ సాధించిన రాజ్ కుమార్ ను ఉన్నతాధికారులు సిబ్బంది అభినందించారు
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.