చుండూరు జనవరి5 కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా గుర్తించి ప్రతి నెలవాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబుఅన్నారు 2750 పెన్షన్ను పెంపు ద్వారా 3000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రారంభించారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వ ఆయాయంలో పెన్షన్ల కోసం రోజుల తరబడి కార్యాలయాలు చుట్టూజన్మభూమి కమిటీల చుట్టూతిరిగే వారన్నారుముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అర్హత ఉన్న ప్రతి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు ఇటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు అండగా ఉండాలన్నారుఈ సందర్భంగా గతంలో 7549 పెన్షన్ లు ఉండగాకొత్త 202పెన్షన్లను కలపి7751పంపిణీ చేశారు ఈకార్యక్రమంలోఎంపీపిజాలాదిరూబెన్ గ్రామ సర్పంచ్ ఉయ్యూరు అప్పి రెడ్డి ఎంపీడీవో టి సుగుణవైసిపి నాయకులు వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
వరద బాధితులకు విజ్ఞాన్స్ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.