Skip to main content

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – న్యూకాన్‌ ఏరోస్పేస్‌ల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – న్యూకాన్‌ ఏరోస్పేస్‌ల మధ్య అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌లోని న్యూకాన్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల(ఎన్‌ఏపీఎల్‌) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని శనివారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్‌ఏపీఎల్‌ ఆర్‌ అండ్‌ డీ జనరల్‌ మేనేజర్‌ జేఎల్‌పీ తిలక్‌తో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, డిఫెన్స్‌ టెక్నాలజీలకు సంబంధించిన రంగాలలో ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, వాటికి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఉమ్మడిగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు మరియు ఇండస్ట్రీ–అకాడెమియా ఇంటరాక్షన్స్‌ను నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించడం, ప్రాక్టికల్‌ ఇండస్ట్రీ అనుభవాన్ని అందించడంతో పాటు వృత్తిపరమైన వృద్ధిని పెంపొందిస్తామన్నారు. ఎన్‌ఏపీఎల్‌ ఉద్యోగుల కోసం ఎంటెక్‌ కోర్సును ప్రత్యేకంగా రూపొందించి వారిలో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు విద్యా అర్హతలను పెంచుతామన్నారు. అంతేకాకుండా నిర్దిష్ట పరిశ్రమ అవసరాలను తీర్చడంతో పాటు విద్యా అనుభవాన్ని పెంచుకోవడానికి ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌లో న్యూకాన్‌ టైలర్డ్‌ మైనర్‌/హానర్‌/మాడ్యులర్‌ ప్రోగ్రామ్‌లను పరిచయం చేస్తామన్నారు. వీటితో పాటు న్యూకాన్‌ ఉద్యోగులకు పీహెచ్‌డీలో ప్రవేశంకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఏపీఎల్‌ ఆర్‌ అండ్‌ డీ జనరల్‌ మేనేజర్‌ జేఎల్‌పీ తిలక్‌ మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఏపీఎల్‌ హెచ్‌ఆర్‌ విభాగాధిపతి అరవింద్‌ కుమార్, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...