Skip to main content

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు..అవకాశం వదలొద్దు

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు..
అవకాశం వదలొద్దు 
- సోషల్ మీడియా మీ హద్దు!!
-థ్రిల్ సిటీ సోషల్ మీడియా 
ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్ 
కర్టెన్ రైజర్ ఈవెంట్'లో
*మాస్ కా దాస్ విశ్వక్సేన్*
-సృజనాత్మకతను చాటండి 
లక్షల ప్రైజ్ మనీ గెలవండి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
హైద్రాబాద్ కు తలమానికంగా భాసిల్లుతున్న "థ్రిల్ సిటీ - అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్"... సోషల్ మీడియా ప్రభావాశీలుర సృజనాత్మకతకు సవాలు విసిరింది. అసాధారణమైన, అద్భుతమైన అనేక విశేషాల సమాహారంగా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్న "థ్రిల్ సిటీ - థీమ్  పార్క్"లోని ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, హార్రర్ మేజ్, 12D థియేటర్ లాంటి వందలాది యాక్టివిటీస్'ని బేస్ చేసుకుని షూట్ చేసిన వీడియో రీల్ ను  చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల నుంచి అత్యుత్తమమైన వీడియో రీల్స్ మూడింటిని ఎంపిక చేసి, తలా లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల నగదు బహుమతులను అందించే బృహత్ కార్యక్రమానికి తెర తీసింది. యంగ్ టాలెంట్ ను కూడా యంకరేజ్ చేసే "థ్రిల్లింగ్ ఇన్ఫ్లేన్సర్  చాలెంజ్" ఈవెంట్ కర్టెన్ రైజర్ వేడుకకు ముఖ్య అతిధిగా టాలీవుడ్ యువ సంచలనం విశ్వక్సేన్  విచ్చేశారు. ఈరోజున సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపార రంగమంటూ ఏదీ లేదని, టాలెంట్ ఎవరి సొత్తూ కాదని, క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా పట్టం కడుతుందని ఈ సందర్భంగా విశ్వక్సేన్ పేర్కొన్నారు. ఇందులోకి కొత్తగా ప్రవేశించేవాళ్ళు కూడా ఇందులో బ్రహ్మాండంగా రాణించవచ్చని ఆయన అన్నారు. "థ్రిల్ సిటీ" సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్ ఈవెంట్ కి కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న "బందూక్" లక్ష్మణ్ మాట్లాడుతూ... మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తామని" తెలిపారు. ఈ కార్యక్రమంలో థ్రిల్ సిటీ టీమ్ ఫీయాక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ స్వీకర్'తో పాటు హైద్రాబాద్ వ్యాప్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Popular posts from this blog

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజ్ఞాన్స్‌ విద్యార్థుల ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన 4వ ఏపీ సీనియర్‌ క్యోరుగి తైక్వాండో చాంపియన్‌షిప్‌–2024లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 5 బంగారు పతకాలు, 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. బంగారు పతకాలు సాధించిన బీహెచ్‌ సామ్యూల్‌ చార్లీ (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌ – మొదటి సంవత్సరం), డీ.హర్షిత్‌ ( సీఎస్‌ఈ– రెండో సంవత్సరం), ఏ.భవిష్య ( ఈసీఈ– మొదటి  సంవత్సరం), వీ.నిఖిల ( బయోటెక్‌– రెండో సంవత్సరం), ఎండీ. కరిష్మ ( సీఎస్‌ఈ – రెండో  సంవత్సరం), రజత పతకం సాధించిన ఎం.ఎం. ఆషంటే ( మెకానికల్‌ – మొదటి  సంవత్సరం) విద్యార్థులు నవంబర్‌ నెల చివరి వారంలో...