ఏపీబీజేఏ ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు లోని ట్రావెల్స్ బంగ్లా సమీపంలో ఉచిత చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి సేవ చేస్తున్న తీరును అభినందించారు. గుంటూరు జిల్లా పాత్రికేయులకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. వేసకాలంలో ఎండలో ప్రయాణం చేస్తున్న ప్రజలకు దప్పికి తీర్చడం హర్షణీయమన్నారు. అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఇటువంటి మంచికార్యాలు చూస్తూ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్, ప్రధాన కార్యదర్శి పట్నాల సాయి కుమార్, నాయకులు అచ్యుత సాంబశివరావు, ఎస్ఎస్ జహీర్ లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్
గుంటూరు జిల్లా అధ్యక్షుడు బోస్క సువర్ణ బాబు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, హానరబుల్ ప్రెసిడెంట్ నాగరాజు, ట్రెజరర్ బ్రహ్మం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి, లీగల్ అడ్వైజర్ సువర్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.