సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి
_ రత్నాకర్ కనపర్తి, దర్శకుడు
తెనాలి: సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి అని దర్శకుడు కనపర్తి రత్నాకర్ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో లో శుక్రవారం మహాత్మా జ్యోతి రావు పూలే చిత్ర విశేషాలను విలేకరులకు చిత్ర యూనిట్ వివరించారు..ఈ సందర్భం గా రత్నాకర్ మాట్లాడుతూ మహోన్నతుల చరిత్రను భావి తరాలకు చాటి చెప్పేందుకు సినిమా మాధ్యమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
మహిళా విద్య కోసం, విధవ రాళ్ళ పునర్వివాహాలకోసం, సమసమాజ స్థాపన కోసం జ్యోతి రావు పూలే పాటుపడ్డారన్నారు. ఇలాంటి మహానీయుల చరిత్రను వెండి తెరపై దృశ్య కావ్యం గా మలచిన దర్శక, నిర్మాతలకు, చిత్ర టీం కు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఫిల్మ్ ఫెస్టివల్స్ లో జ్యోతి రావు పూలే సినిమా ప్రదర్శనకోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. నిర్మాత, నటుడు పెద్దింటి యోహాను మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని, 20 మంది తెనాలి కళాకారులు సినిమాలో నటించినట్లు తెలిపారు. ఈ నెల 10 తేదీన తెనాలి పెమ్మసాని థియేటర్ లో చిత్ర ప్రదర్శన జరుగుతుందన్నారు. పది రోజుల పాటు ఉదయం 9 గంటలకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు. సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, బెల్లం కొండ వెంకట్ లు మాట్లాడుతూ చిత్రం లో నటించడం సంతోషానిచిందన్నారు. తొలుత జ్యోతి రావు పూలే చిత్ర పోస్టర్ ను దర్శకుడు రత్నాకర్ ఆవిష్కరించారు.