జేఈఈ మెయిన్ పరీక్షలో విజ్ఞాన్ విజయపరంపర
ఐఐటీ – జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్’’ విద్యార్థులు విజయపరంపర మోగించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ – జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్ సాధించారు. ఇందులో వై. విష్ణుకార్తీక్ (99.45), ఆర్.శ్రీకాంత్ (98.38), కే.విష్ణు వర్ధన్ (98.05), ఎం.ఉమేష్ ఎన్‌ఎస్‌ఎల్ నారాయణ్ (97.01), ఎస్.ప్రేమ్ సాగర్ (96.33), ఏ.రిక్యిత్ (96.30), ఎస్‌డీ.అర్షద్ (96.29), ఎస్‌కే ఎంరోజ్ బాష (96.13), ఆర్.నాగ జశ్వంత్ (94.11), ఎంవీ. గౌతమ్ రెడ్డి (93.74), కే.చరణ్‌రాజ్ (93.73), వీ.కౌశిక్ (93.47), వీ.యశ్వంత్ మణికంఠ (93.11), ఎస్.అవినాష్ (91.08), (93.55), సీ.రేవంత్ (93.45), పీ.అమర్ లోకేష్ (93.48), ఎల్‌పీజీ సాయి (92.24), బీ.సాయి రామ్‌రెడ్డి (92.16), వై నాగ వీర కార్తికేయ (90.96), కే.తరున్ గుప్త (90.49), బీ.హేమంత్ (90.21)లు ఉత్తమ పర్సంటైల్‌తో రాణించారని వెల్లడించారు. గత 48 సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో ప్రవేశాలు కల్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి విజయమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు తగిన విధంగా తాము అందజేస్తున్న అత్యున్నత స్థాయి విద్యా విధానం వల్లనే తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర లావు రత్తయ్య, వడ్లమూడి, గుంటూరు మహిళల జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ జే.మోహన్ రావు, వై. వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.