సీనియర్ జర్నలిస్ట్ పవర్ ఆఫ్ ఆర్టీఐ సాయికుమార్ కు మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ స్మారక పురస్కారం
_ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అతిథులచే ప్రధానం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
గుంటూరు నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పట్నాల సాయికుమార్ కు
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయు) సంస్థ స్థాపించి ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ స్మారక పురస్కారంతో ఆదివారం రాత్రి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అతిథులచే ఘనంగా సత్కరించారు. దీనిలో భాగంగా పాత్రికేయునిగా గత 25 ఏళ్లుగా నిస్వార్థ సేవలు అందిస్తున్న సాయికుమార్ ను భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అవార్డుకు కమిటీ ఎంపిక చేసి జ్ఞాపిక అభినందన పత్రం అందించి ముఖ్య అతిథి శాసన మండలి మాజీ స్పీకర్,ప్రభుత్వ సలహాదారు షరీఫ్ ఇతర ప్రముఖులచే దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.