జూన్ 7 న భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కొల్లిపర మండలం, తూములూరు గ్రామ శివారు, క్రిష్టియన్ పాలెం లో నూతనంగా ఏర్పాటు చేసిన, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ జూన్ 7 వ తేదీ సాయంత్రం 6 గంటలకు పి.వి. సునీల్ ఐ ఏ ఎస్, అంబేద్కర్ ఇండియా మిషిన్ వ్యవస్థాపకులు ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తారని ఆ గ్రామ కమిటీ సభ్యులు జ్ఞాన శేఖర్, తెనాలి మోహన్, కనపర్తి మోహనరావు, తెనాలి. కిషోర్, బేతాళ భూషణం, బట్ట నాగేశ్వరరావు, కనపర్తి, జేమ్స్ రాజు, కనపర్తి అబ్రహం లింకన్ లు తెలిపారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.