వైద్య రంగంలో కొత్త శకానికి నాంది _ జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్ వి.గోపాల కృష్ణ _ విజ్ఞాన్స్ లారా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం టాలెంట్ ఎక్స్ ప్రెస్: మెడికల్ రంగంలో ఆధునిక పదార్థాల వాడకం ద్వారా కృత్రిమ అవయవాలు, డెంటల్ ఇంప్లాంట్లు, బోన్ ప్లేట్స్ వంటి వాటిని శరీరానికి అనుకూలంగా తయారు చేయడం ఇప్పుడు సాధ్యమవుతోందని జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్ వి.గోపాల కృష్ణ అన్నారు. బయోకంపాటబుల్ పదార్థాలు శరీరంలో తిరస్కరణ లేకుండా పనిచేయడం వల్ల వైద్య రంగంలో ఇది ఒక కొత్త శకానికి నాంది అని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం, వడ్లమూడి లోని విజ్ఞాన్స్ లారా ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్‌టీయూ కాకినాడ వారి సౌజన్యంతో ‘‘అడ్వాన్సెస్ ఇన్ మెటీరియల్స్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్’’ అనే అంశంపై ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్ వి.గోపాల కృష్ణ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితత్వంతో కూడిన వస్తు తయారీ అనేది వైమానిక, ఖగోళ పరిశోధ...