Skip to main content

Posts

Showing posts from April, 2025

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయపరంపర

జేఈఈ మెయిన్‌ పరీక్షలో విజ్ఞాన్‌ విజయపరంపర టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఐఐటీ – జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ‘‘విజ్ఞాన్‌’’ విద్యార్థులు విజయపరంపర మోగించారని విజ్ఞాన్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మా వద్ద ఐఐటీ – జేఈఈ మెయిన్స్‌ కోచింగ్‌ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్‌ సాధించారు. ఇందులో వై. విష్ణుకార్తీక్‌ (99.45), ఆర్‌.శ్రీకాంత్‌ (98.38), కే.విష్ణు వర్ధన్‌ (98.05), ఎం.ఉమేష్‌ ఎన్‌ఎస్‌ఎల్‌ నారాయణ్‌ (97.01), ఎస్‌.ప్రేమ్‌ సాగర్‌ (96.33), ఏ.రిక్యిత్‌ (96.30), ఎస్‌డీ.అర్షద్‌ (96.29), ఎస్‌కే ఎంరోజ్‌ బాష (96.13), ఆర్‌.నాగ జశ్వంత్‌ (94.11), ఎంవీ. గౌతమ్‌ రెడ్డి (93.74), కే.చరణ్‌రాజ్‌ (93.73), వీ.కౌశిక్‌ (93.47), వీ.యశ్వంత్‌ మణికంఠ (93.11), ఎస్‌.అవినాష్‌ (91.08),  (93.55), సీ.రేవంత్‌ (93.45), పీ.అమర్‌ లోకేష్‌ (93.48), ఎల్‌పీజీ సాయి (92....

ఏపీబీజేఏ ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం

ఏపీబీజేఏ ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్  అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు లోని ట్రావెల్స్ బంగ్లా సమీపంలో ఉచిత చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి సేవ చేస్తున్న తీరును అభినందించారు. గుంటూరు జిల్లా పాత్రికేయులకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. వేసకాలంలో ఎండలో ప్రయాణం చేస్తున్న ప్రజలకు దప్పికి తీర్చడం హర్షణీయమన్నారు. అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఇటువంటి మంచికార్యాలు చూస్తూ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్,  ప్రధాన కార్యదర్శి పట్న...

Andhra Pradesh Broadcasting Journalists Association (APBJA) has formed a new committee for Guntur district.

Talent Express News:  Under the auspices of the Andhra Pradesh Working Journalists Federation (APWJF), the Andhra Pradesh Broadcasting Journalists Association (APBJA) has formed a new committee for Guntur district. The committee was elected in a meeting held under the leadership of State Secretary Mr. Anjaneyulu, Broadcasting State General Secretary Mr. Srinivas, Union Founder Mr. Konda Babu, APWJF Guntur District President Mr. Ratnakar, and General Secretary Mr. Sai Kumar. The newly elected Guntur district media committee includes: • President: Boska Suvarna Babu • Secretary: Keshamshetty Srinivasa Rao • Treasurer: Gajula Brahmam • Organizing Joint Secretary: G.V. Sai Krishna • Honorary President: Ponugubati Nagaraju • Vice Presidents: Khaja Peer and Lingineni Avinash • Legal Advisor: Moparthi Suvarna Raju Several executive members were also elected. On this occasion, state leaders assured that the union would stand firmly with journalists, regardless of affiliation, i...

సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి

సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి _ రత్నాకర్ కనపర్తి, దర్శకుడు  తెనాలి: సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి అని దర్శకుడు కనపర్తి రత్నాకర్ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో లో శుక్రవారం మహాత్మా జ్యోతి రావు పూలే చిత్ర విశేషాలను  విలేకరులకు చిత్ర యూనిట్ వివరించారు..ఈ సందర్భం గా రత్నాకర్ మాట్లాడుతూ మహోన్నతుల చరిత్రను భావి తరాలకు చాటి చెప్పేందుకు సినిమా మాధ్యమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  మహిళా విద్య కోసం, విధవ రాళ్ళ పునర్వివాహాలకోసం, సమసమాజ స్థాపన కోసం జ్యోతి రావు పూలే పాటుపడ్డారన్నారు. ఇలాంటి మహానీయుల చరిత్రను వెండి తెరపై దృశ్య కావ్యం గా మలచిన దర్శక, నిర్మాతలకు, చిత్ర టీం కు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఫిల్మ్ ఫెస్టివల్స్ లో జ్యోతి రావు పూలే సినిమా ప్రదర్శనకోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. నిర్మాత, నటుడు పెద్దింటి యోహాను మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని, 20 మంది తెనాలి కళాకారులు సినిమాలో నటించినట్లు తెలిపారు. ఈ నెల 10 తేదీన తెనాలి పెమ్మసాని థియేటర్ లో చిత్ర ప్రదర్శన జరుగుతుందన్నారు. పది రోజుల పాటు ఉదయం 9 గంటలకు ప్రదర్శన కొనసాగ...

Grand opening